Site icon HashtagU Telugu

Group-II Applications: గ్రూప్‌-2 కు ఫుల్ డిమాండ్.. ఒక్కో పోస్టుకు 705 దరఖాస్తులు

Telangana Job Notifications2022

Telangana Job Notifications2022

Group-2 : గ్రూప్‌-2 ఉద్యోగాల కోసం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు (Applications) చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ (TSPSP) వెల్లడించింది. ప్రభుత్వ విభాగాల్లోని వివిధ 783 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 (Group-2) నోటిఫికేషన్‌ (డిసెంబర్‌ 29, 2022న నెంబర్‌ 28/2022 )ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి గురువారం (ఈనెల 16న) సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా,  (Group-2) ఒక్కో పోస్టుకు 705 మంది దరఖాస్తు చేసుకోవటం గమనార్హం.

Also Read: Twitter Office Close: ఇండియాలో ట్విట్టర్ ఆఫీస్ క్లోజ్.. ఎలాన్ మస్క్ ‘వర్క్ ఫ్రం హోం’ ప్రకటన!