IPL mega auction: శత్రువులే మిత్రులయ్యారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి రోజు వేలంలో ఓ రెండు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ipl Special

Ipl Special

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి రోజు వేలంలో ఓ రెండు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.మెగా వేలంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.. ఓ ముగ్గురు క్రికెటర్లను కొనుగోలు చేసిన తీరు ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. వారిలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారత ఆల్ రౌండర్లు, దీపక్ హుడా, కృనాల్ పాండ్య ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరఫున జోస్ బట్లర్ బరిలోకి దిగగా.. పంజాబ్ కింగ్స్ సారథిగా అశ్విన్ ఉన్నాడు. ఆసీజన్ లో బట్లర్‌ని మాన్కడింగ్ చేసిన అశ్విన్.. అతనితో మైదానంలోనే మాటల యుద్దానికి దిగాడు. అయితే.. ఐపీఎల్ 2021లో అశ్విన్ ఢిల్లీకి ఆడగా.. జోస్ బట్లర్ మాత్రం రాజస్థాన్ రాయల్స్‌లోనే ఉన్నాడు. తాజాగా వేలంలో అశ్విన్‌ని రూ.5 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. దాంతో.. ఈ ఏడాది ఇద్దరూ కలిసి రాజస్థాన్ తరఫున ఆడబోతున్నారు. నేను క్రేజు లోపలే ఉన్నాను…నీతో కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నా అంటూ బట్లర్ అశ్విన్ కు వెల్ కమ్ చెబుతూ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ గా మారింది.

ఇక గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ సమయంలో బరోడా జట్టుకు కెప్టెన్ గా ఉన్న కృనాల్ పాండ్య, ఆ ఆజట్టు ఆటగాడు దీపక్ హుడా మధ్య వివాదం చెలరేగింది. వీరిద్దరి మధ్య డ్రెస్సింగ్ రూములో గొడవ జరిగిందనే వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే దీపక్ హుడా బరోడా జట్టును వీడాడు. కానీ.. ఈసారి వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ కృనాల్ పాండ్యాని రూ.8.25 కోట్లకి, దీపక్ హుడాని రూ.5.75 కోట్లకి కొనుగోలు చేసింది.

  Last Updated: 13 Feb 2022, 05:08 PM IST