Site icon HashtagU Telugu

Air India: విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు

Air India Flight

Resizeimagesize (1280 X 720) (1)

దుబాయ్​ నుంచి భారత్‌కు వస్తున్న ఎయిరిండియా (Air India) విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అబుదాబి నుంచి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కాలికట్‌ (కోజికోడ్‌) బయల్దేరింది. అయితే టేకాఫ్‌ అయి విమానం 1000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించి పైలట్‌ వెంటనే విమానాన్ని అబుదబీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు DGCA వెల్లడించింది.

అబుదాబి నుంచి కాలికట్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం మధ్యలో విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా అబుదాబిలో ల్యాండ్ చేశారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. DGCA ఈ సంఘటనను ధృవీకరించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ B737-800 VT-AYC ఆపరేటింగ్ ఫ్లైట్ IX 348 (అబుదాబి-కాలికట్) టేకాఫ్ సమయంలో ఇంజిన్ నంబర్ వన్‌లో మంటలు చెలరేగినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ సమయంలో విమానం 1000 అడుగుల ఎత్తులో ఉంది. అనంతరం విమానాన్ని సురక్షితంగా అబుదాబిలో దించారు.

DGCA ప్రకారం.. సంఘటన సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయ్యి 1000 అడుగుల ఎత్తుకు చేరుకున్న వెంటనే విమానం పైలట్ ఇంజిన్‌లో ఒకదానిలోంచి స్పార్క్ రావడం చూశానని, ఆ తర్వాత విమానాన్ని వెంటనే అబుదాబి విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

Also Read: Ugandan Villager: ఓరి నాయనో.. ఆయనకి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు..!

అంతకుముందు జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా 45 నిమిషాల తర్వాత తిరిగి త్రివేండ్రంలో ల్యాండ్ అయింది. మీడియా కథనాల ప్రకారం.. విమానం ఫ్లైట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో కొంత సాంకేతిక లోపం ఉంది. గతేడాది డిసెంబర్ 22న దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించింది. విమానం కాలికట్ నుండి బయలుదేరింది. దుబాయ్ చేరుకున్న తరువాత విమానంలో పాము గుర్తించబడింది.