Site icon HashtagU Telugu

Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్త‌ర్వులు జారీ..!

Mobile Number With Aadhaar

Mobile Number With Aadhaar

Aadhaar As Date Of Birth Proof: లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ కార్డు (Aadhaar As Date Of Birth Proof) సరిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా బర్త్ సర్టిఫికెట్ ని తీసుకొనే వారు ఇప్పుడు ఆధార్ సరిపోతుందని UIDAI వారు సర్క్యులర్ విడుదల చేసారు. అయితే గతంలో డేట్ ఆఫ్ బ‌ర్త్‌కు ప్రూఫ్‌గా బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌ను అడిగేవారు. అయితే ఆధార్ కార్డు భార‌త ప్ర‌భుత్వంచే జారీ చేయ‌బ‌డుతుంది. భార‌త్‌లో పుట్టిన ప్ర‌తి ఒక్క‌రికి ఆధార్ కార్డు ముఖ్య‌మైన డాక్యుమెంట్స్‌లో ఒక‌టి.

Also Read: Hirsutism: స్త్రీల ముఖంపై గ‌డ్డం, మీసాలు క‌నిపించ‌డానికి గ‌ల కార‌ణాలివే..?

అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో EPFO జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. EPFO ​​సంబంధిత పని సమయంలో పుట్టిన తేదీని సరిదిద్దడానికి చెల్లుబాటు అయ్యే పత్రాల జాబితా నుండి కూడా ఆధార్ ను తొల‌గించింది. EPFO వంటి అనేక సంస్థలు పుట్టిన తేదీని ధృవీకరించడానికి ఆధార్‌ను ఉపయోగిస్తున్నాయని UIDAI తెలిపింది. కానీ అనేక హైకోర్టుల ఆదేశాలను ప్రస్తావిస్తూ పుట్టిన తేదీకి ఆధార్ చెల్లుబాటు అయ్యే రుజువు కాదని అన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్ షీట్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డ్ వంటి పత్రాలు పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువుగా ఉపయోగించబడతాయని అప్పుడు పేర్కొన్నారు.

We’re now on WhatsApp : Click to Join