High Profile Thief: దొంగతనాలు చేయడానికి విమానంలో వెళ్లిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందో తెలుసా?

ఈ మధ్యకాలంలో దొంగలు దొంగతనాలు చేయడం కోసం కొత్త కొత్త ప్లాన్ లను వేస్తున్నారు. ఆ ప్లాన్లు వింటే ఆశ్చర్యం వేయక మానదు. అంతేకాకుండా కొందరు దొంగతన

  • Written By:
  • Publish Date - July 6, 2023 / 05:20 PM IST

ఈ మధ్యకాలంలో దొంగలు దొంగతనాలు చేయడం కోసం కొత్త కొత్త ప్లాన్ లను వేస్తున్నారు. ఆ ప్లాన్లు వింటే ఆశ్చర్యం వేయక మానదు. అంతేకాకుండా కొందరు దొంగతనంలో వినూత్నంగా ఆలోచిస్తూ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కొందరు మాత్రం చోరీల కోసం భిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో కేరళలోని తిరువనంతపురంలో తాళంవేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

అంతేకాకుండా ఆ దొంగ చోరీలు చేయడం కోసం ఏకంగా విమానాల్లో వెళ్తుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తి చోరీల తీరును కేరళ పోలీసులు వెల్లడించారు. ఒక వ్యక్తి కేరళకు తరచుగా విమానాల్లో వస్తుంటాడట. ఇక అక్కడకు చేరుకున్న తర్వాత ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. అనంతరం గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో రాత్రి సమయాల్లో మళ్లీ అక్కడకు వెళ్లి ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడేవాడు. గత మే నెలలో పద్మనాభస్వామి ఆలయం సందర్శనకు వచ్చాడు.

జూన్‌లో ప్రణాళిక వేసుకున్న అతడు ఇళ్లలో చోరీ చేసేందుకు ఇటీవల మళ్లీ వచ్చాడు. కేవలం బంగారు నగలు మాత్రమే ఎత్తుకెళ్లేవాడు. వాటిని ఖమ్మం మాత్రం తీసుకెళ్లేవాడు కాదు. వాటిని తాకట్టు పెట్టి డబ్బు మాత్రమే తీసుకునేవాడు అని తిరువనంతపురం పోలీస్ కమిషనర్‌ సీహెచ్‌ నాగరాజు వెల్లడించారు. ఒక ఆటో డ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో ఈ హై ప్రొఫైల్‌. దొంగను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగతనాలు చేయడం కోసం ఆ దొంగ చేసిన ఆ ప్లాన్లు చూసి పోలీసులు సైతం మార్చారు పోతున్నారు.