Car Rams Mayor House : మేయర్ ఇంటిపై కారుతో ఆత్మాహుతి దాడి.. ఏమైందంటే ?

పారిస్‌లోని ఒక పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంట్లోకి నిరసనకారులు కారుతో దూసుకెళ్లారు. 

  • Written By:
  • Updated On - July 3, 2023 / 06:46 AM IST

Car Rams Mayor House : ట్రాఫిక్ సిగ్నల్ ను ఉల్లంఘించి దూసుకుపోతున్న 17 ఏళ్ల బాలుడు నహెల్ ఎమ్‌ని పోలీసులు కాల్చి చంపిన ఘటనతో ఫ్రాన్స్ ఇంకా అట్టుడుకుతోంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా గత 5 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పారిస్‌లోని ఒక పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంట్లోకి ఒక నిరసనకారుడు మంటల్లో కాలుతున్న కారుతో దూసుకెళ్లాడు.  ఈ ఘటనలో మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ భార్య, పిల్లలు గాయపడ్డారు.

Also read : Floating Restaurant : ఇండియాలో మరో తేలియాడే రెస్టారెంట్.. టూర్ ప్యాకేజ్ వివరాలివీ

ఈ విషయాన్నిట్విట్టర్ వేదికగా మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్  వెల్లడించారు. “ఆందోళనకారులు మాపై హత్యాయత్నం (Car Rams Mayor House) చేశారు. ఇది పిరికి చర్య. మేం శనివారం రాత్రి నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగింది” అని ఆయన  ట్వీట్ చేశారు. కాగా, ఫ్రాన్స్ లో జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రభుత్వం 45,000 మంది పోలీసులను మోహరించింది.