Site icon HashtagU Telugu

Viral Video: టిప్ టిప్ బార్సా పానీ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫ్రెంచ్ డ్యాన్సర్..!!

dancer

dancer

బాలీవుడ్ మ్యూజిక్ ఎప్పుడు కూడా ప్రపంచాన్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో బాద్షా పాటపై ఒక అమ్మాయి డ్యాన్స్ తో ఇరగదీసింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన సూర్యవంశీ సినిమాలోని ” టిప్ టిప్ బర్సా పానీ” అనే పాటకు ఎంత పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.

ఈ పాటకు ఫ్రెంచ్ డ్యాన్సర్ ట్రూప్ లీడర్ జికా…స్టేడియంలో స్టెప్పులు చేశాడు. వీడియో తీసి జికా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. అంతేకాదు ఆ వీడియోకు ” టిప్ టిప్ వైబ్స్ ” అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడా వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జికా వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Exit mobile version