AP : టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – చంద్రబాబు కీలక ప్రకటన

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు (Chandrababu).

Published By: HashtagU Telugu Desk
Cbn Vision 2024

Cbn Vision 2024

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu)..ఏపీ ప్రజలకు గొప్ప వరాలు ప్రకటించారు. దసరా రోజున టీడీపీ పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఓటమి చవిచూసిన చంద్రబాబు..ఈసారి ఎలాగైనా వైసీపీ ని గద్దె దించి..అధికారం చేపట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం పొత్తులతో బరిలోకి దిగబోతున్నారు. జనసేన (Janasena) , బిజెపి (BJP) పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ..ఇదే కన్ఫామ్ అని తేలిపోయింది.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడం తో చంద్రబాబు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ (YCP) ఎలాగైతే హామీలు కురిపించి అధికారం చేపట్టిందో..అంతకు మించి హామీలతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు చంద్రబాబు. ఈరోజు రాఖీ సందర్బంగా మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ లో రాఖీ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. టీడీపీ మహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు అందజేశారు.

Read Also : Bhuvaneshwari: భువనేశ్వరి భావోద్వేగం, లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కన్నీళ్లుపెట్టా!

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..మహిళలకు గొప్ప వరాలు ప్రకటించారు. మహిళా సంక్షేమం కోసం టీడీపీ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని, మేనిఫెస్టోలోనూ మహిళాభ్యున్నతికే పెద్ద ఎత్తున పథకాలు పెడతామని తెలిపారు. ఆరోజు ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం కింద సిలిండర్లు అందజేశామని… ఆడబిడ్డల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందన్నారు. మహిళలను ఆర్థికంగా స్థిరపరిచేందుకు టీడీపీ అన్ని వేళలా కృషి చేస్తుందని ఈ సందర్భాంగా మరోసారి స్పష్టం చేసారు. మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడమే టీడీపీ లక్ష్యం అని, NTR ఆత్మగౌరవం ఇస్తే నేను ఆత్మవిశ్వాసం ఇచ్చానని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (ladies free bus journey) అందిస్తామని ప్రకటన చేశారు. అలాగే తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15,000 ప్రోత్సాహకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం , దీపం పథకం కింద ప్రతి ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, అవసరమైతే మరో సిలిండర్‌ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించామన్నారు. పీ-4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తాం అని, ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయవచ్చన్నారు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడని.. పేదవాడు మరింత పేదవానిగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

  Last Updated: 30 Aug 2023, 10:17 PM IST