Site icon HashtagU Telugu

Women’s Day : నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం.. బెంగుళూరులో బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత‌ ప్ర‌యాణం

KSRTC

KSRTC

నేడు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా బెంగళూరులోని మహిళలకు నగరంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) తెలిపింది. BMTC మార్చి 8న AC వజ్ర, వ్యువజ్ర (విమానాశ్రయం) సేవలతో సహా అన్ని బస్సు సర్వీసులలో మహిళా ప్రయాణీకులందరికీ ఉచిత సౌకర్యాలను అందిస్తుంది. మహిళలకు సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడమే దీని ప్రాథమిక లక్ష్యం అని BMTC తెలిపింది. నగరంలో మహిళలు ప్రజారవాణాను వినియోగించుకోవడం వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం తగ్గుముఖం పడుతుందని తెలిపింది.