కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళల కోసం ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. మామూలుగా పది రూపాయలు తక్కువ ఖర్చు అవుతుంది అంతే బస్సులు ఆటోలలో వెళ్లడానికి కూడా చాలా మంది వెనకాడరు. అలాంటిది ఏకంగా ఫ్రీగా బస్సులో ప్రయాణించడం అంటే దానికి క్యూ పోటీ ఏ రేంజ్ లో ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కర్ణాటకలో ప్రవేశపెట్టిన ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం కర్ణాటక మహిళలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. భారీ సంఖ్యలో కె ఎస్ ఆర్ టి సి బస్సుల్లో మహిళలు పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారు. మరీ ముఖ్యంగా ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్యం, మురుడేథ్వర్,హంపి వంటి పుణ్యక్షేత్రాలకు పర్యాటక ప్రాంతాలకు మహిళలు వెళ్తున్నారు. దాంతో బస్సులు మహిళా ప్యాసింజర్లతో కిక్కిరిసిపోతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని పలుమార్గాలలో బస్సులన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. కనీసం బస్సులో అడుగు మోపే స్థలం కూడా లేకుండా అధిక సంఖ్యలో మహిళలు బస్సులోకి ఎక్కుతున్నారు.
విజయపుర బస్సులో టికెట్లు తీసుకోవడానికి ఒక కండక్టర్ పడుతున్న పాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్యాసింజర్ల మధ్యలో మడుచుకొని వెళ్లడానికి గ్యాప్ లేకపోవడంతో కండక్టర్ సీట్ల పైకి ఎక్కి టికెట్లు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కేవలం కొన్ని బస్సుల్లో మాత్రమే కల్పించింది. కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లోని ఈ ఫ్రీ సౌకర్యం ఉంది. ఇక ఆ బస్సుల్లో ప్యాసింజర్లతో కిటికిటలాడుతున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తో ఫ్రీ బస్ అంటే అలాగే ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.