Site icon HashtagU Telugu

Godavari: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకులు అదృశ్యం

Godavari

Godavari

Godavari: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని సజ్జాపురం పార్కు వీధి ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం యానాం నుంచి విహారయాత్రకు బయలుదేరారు. వీరంతా మూడు మోటార్ సైకిళ్లపై యానాం చేరుకుని అక్కడ కాసేపు గడిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తాళ్లరేవు మండలం గోపిలంక పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ భోజనం చేసి అందరు గోదావరి ఒడ్డున కూర్చొని ఉండగా ఒకరు స్నానం చేసేందుకు గోదావరిలోకి దూకాడని, అయితే లోతు ఎక్కువగా ఉండడంతో నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు.

ఇది చూసిన ముగ్గురు స్నేహితులు అతడిని కాపాడేందుకు నదిలోకి దూకారు. అయితే నలుగురూ ప్రవాహంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిని హనుమకొండ కార్తీక్ (21), మద్దిని ఫణీంద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21), తిరుమలరావు రవితేజ (21) గా గుర్తించారు . మిగిలిన స్నేహితుల్లో నేదునూరి భానుప్రసాద్ భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికుల సహకారంతో సలాది దుర్గా మహేష్, కొమ్మిరెడ్డి చైతన్య గోదావరిలో స్నేహితుల కోసం వెతికినా ఫలితం లేకపోయింది.

దీంతో వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి స్నేహితులను కోల్పోయిన విషయాన్ని తెలిపారు. సమాచారం విపత్తు నిర్వహణ అధికారులకు చేరగా, వారి ద్వారా కోనసీమ జిల్లా కలెక్టర్‌కు సమాచారం అందింది. తాళ్లరేవు తహశీల్దార్‌ను పిలిపించి తగు సూచనలు చేశారు. తప్పిపోయిన వారి కోసం అన్వేషణ విఫలమైంది. గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోరింగ ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

Also Read: Telangana State Bird – Dussehra : పాలపిట్ట ఎందుకు శుభప్రదం ? అది అంతరిస్తోందా ?