Uttarakhand: అర్ధనగ్నంగా యువకుల పార్టీ.. వైరల్ వీడియో

పర్యాటక సీజన్‌లో కొంతమంది పర్యాటకులు సరదాగా గడిపేటప్పుడు నియమ, నిబంధనలను ఉల్లంఘించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యువత మద్యం సేవిస్తూ ఇతరులకు ఆటంకం కలిగిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్ లో ఇదే జరిగింది.

Uttarakhand: పర్యాటక సీజన్‌లో కొంతమంది పర్యాటకులు సరదాగా గడిపేటప్పుడు నియమ, నిబంధనలను ఉల్లంఘించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యువత మద్యం సేవిస్తూ ఇతరులకు ఆటంకం కలిగిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్ లో ఇదే జరిగింది.

ఉత్తరాఖండ్ లోని రాజాజీ టైగర్ రిజర్వ్‌లో సాంగ్ నదికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో రెగ్యులర్ పెట్రోలింగ్‌లో కొంతమంది యువకులు మద్యం సేవిస్తూ అటవీ సిబ్బందికి పట్టు బడ్డారు. నిషేధిత ప్రాంతంలో నిబంధనలను ఉల్లంగిస్తూ మద్యం సేవిస్తున్న సదరు యువకుల్ని ఆ ప్రాంతం నుంచి వెళ్లమని చెప్పడంతో వారంతా కోపోద్రిక్తమై అటవీశాఖ ఉద్యోగి ప్రదీప్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. మెడ పట్టుకుని చంపేస్తానని కూడా బెదిరించాడు. అనంతరం ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత ఫారెస్ట్ గార్డు ప్రదీప్ వ్రాతపూర్వక ఫిర్యాదు మేరకు అందరిపై సెక్షన్ 353/506 కింద చర్యలు తీసుకున్నారు.

సాంగ్ నది ప్రాంతం రాజాజీ టైగర్ రిజర్వ్‌లోని నిషేధిత ప్రాంతంలో ఇదివరకు ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి. దీని కోసం ఈ ప్రాంతం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా పెట్రోలింగ్ సమయంలో నలుగురిని అరెస్టు చేశారు. భవిష్యత్తులో ఎవరైనా అటవీ చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పర్యాటకుల్ని హెచ్చరించారు.

Also Read: Mother Kills Daughter: ఫోన్ విషయంలో కూతుర్ని హత్య చేసిన తల్లి.. అసలేం జరిగిందంటే?