Site icon HashtagU Telugu

TN government: స్మగ్లర్ కు సహకారం.. ప్ర‌భుత్వ ఉద్యోగులు అరెస్ట్‌

Tamilnadu

Tamilnadu

ఎర్రచందనం స్మగ్లింగ్ కు స‌హ‌క‌రిస్తున్న న‌లుగురు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 10న  గురువారం పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పాకలవారిపల్లి టోల్ ప్లాజా వద్ద టాస్క్ ఫోర్స్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ స‌మ‌యంలో ఎర్రచందనం స్మగ్లర్లకు సహాయం చేస్తున్న నలుగురు తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఇస్మాయిల్ (46) వాణియంబాడి-వెల్లూర్ డ్రైవర్, జయశంకర్ (46) వాణియంబాడి-వెల్లూర్ కండక్టర్, గోవింద స్వామి (45) వాణియంబాడి-వెల్లూర్ అదనపు కండక్టర్, తిరువణ్ణామలై రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్‌టిసి) మెకానిక్ గుణశేఖరన్ (46) గా గుర్తించారు.  తదుపరి విచారణ కోసం వీరిని అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్ల కోరిక మేరకు బస్సు సిబ్బంది తమిళనాడు నుంచి ఆంధ్రాకు కలపను త‌ర‌లించేవార‌ని పోలీసులు ప్రాథమికంగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఎర్రచందనం కలప స్మగ్లింగ్‌లో గుణశేఖరన్ కీలక వ్యక్తి అని పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసన్  తెలిపారు. తమిళనాడు ఆర్టీసీ బస్సులో 28 స్కూల్ బ్యాగులు, 3 లగేజీ బ్యాగులు, 8 ప్లాస్టిక్ బ్యాగులు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారందరినీ రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version