తమిళనాడులోని కరూర్ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలోని మయనూరు పట్టణ సమీపంలోని కావేరి నదిలో నలుగురు పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. 15 మంది విద్యార్థినులు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఎజూర్‌పట్టిలోని కొంగునాడు ఇంజినీరింగ్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులందరూ తమ ఉపాధ్యాయులతో కలిసి ఉన్నారు. తిరిగి వస్తుండగా కొంత మంది అమ్మాయిలు నదిలోకి దిగారు. అందులో ఓ బాలిక బ్యాలెన్స్ తప్పి కొట్టుకుపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ముగ్గురు స్నేహితులు నదిలో దిగగా.. వారు కూడా నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ నది వద్దకు వచ్చి మృతదేహాలను వెలికితీశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలియజేసి, వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.
4 Killed : తమిళనాడులో విషాదం.. కావేరి నదిలో పడి నలుగురు మృతి

Deaths