Site icon HashtagU Telugu

JK Boat Accident: శ్రీనగర్‌లో విషాదం..పడవ మునిగి నలుగురు మృతి

JK Boat Accident

JK Boat Accident

JK Boat Accident: జమ్మూ కాశ్మీర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని జీలం నదిలో పడవ బోల్తా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు సురక్షితంగా బయటపడి చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్‌లోని గండబాల్-బట్వారా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బోటులో కొందరు పాఠశాల విద్యార్థులు, కూలీలు ఉన్నారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న పోలీసు స్క్వాడ్ వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది.

We’re now on WhatsAppClick to Join

శ్రీనగర్‌లోని SMHS హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్ ముజఫర్ జర్గర్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి తీసుకువచ్చిన ఏడుగురిలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారన్నారు. బోటు బోల్తా పడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో షబ్బీర్ అహ్మద్ (26), 32, 18 ఏళ్ల ఇద్దరు మహిళలు, గుల్జార్ అహ్మద్ (41)గా గుర్తించారు. వీరిని శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.కాగా ఘటన వార్త తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం వెంటనే స్పందించి సంఘటనా స్థలంలో మోహరించినట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలం సహా పలు నదులలో నీటిమట్టం పెరిగింది.

జమ్మూ కాశ్మీర్‌లో నదుల నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పూంచ్-రాజౌరీ జిల్లాలను నేరుగా కాశ్మీర్‌కు కలిపే మొఘల్ రహదారిపై మళ్లీ మంచు కురిసింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.అదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని హంద్వారాలో భారీ వర్షాల కారణంగా నగరం జలమయమైంది. ఒకవైపు ఎగువ ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు దిగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రానున్న రోజుల్లో జమ్మూకశ్మీర్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 20 నుంచి లోయలో వాతావరణం మళ్లీ మారనుంది. దీని కారణంగా స్థానిక ప్రజలు మరియు పర్యాటకుల సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Singham Again : బన్నీని వదిలేసి.. చరణ్‌పై దాడికి సిద్దమవుతున్న సింగం..