Delhi Fire: ఢిల్లీలో అగ్నిప్ర‌మాదం.. 9 నెల‌ల చిన్నారి స‌హా న‌లుగురు మృతి

శుక్రవారం ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో భవనంలో మంటలు (Delhi Fire) చెలరేగడంతో 9 నెలల పాప సహా నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Delhi Fire

Safeimagekit Resized Img (3) 11zon

Delhi Fire: శుక్రవారం ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో భవనంలో మంటలు (Delhi Fire) చెలరేగడంతో 9 నెలల పాప సహా నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను గౌరీ సోని (40), ఆమె 17 ఏళ్ల కుమారుడు ప్రథమ్ సోని, రచనా దేవి (28), ఆమె ఏడాది వయసున్న కుమార్తె రుహి కుమార్‌గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులను రాధిక కుమార్ (16), ప్రభావతి దేవి (70)గా గుర్తించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మృతులంతా రెండు, మూడో అంతస్తుల్లో అద్దెదారులుగా జీవిస్తున్నారని వారు తెలిపారు.

5 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి

ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. షహదారా ప్రాంతంలోని ఒక భవనంలో అగ్నిప్రమాదం గురించి శుక్ర‌వారం సాయంత్రం 5.23 గంటలకు సమాచారం అందిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రం 6:55 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని వైపర్, రబ్బర్, కటింగ్ మిషన్‌లో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో సహా నాలుగు అంతస్తులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Also Read: Supreme Court: న్యాయమూర్తుల మధ్య వివాదం.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయ‌తీ

గాయపడిన 6 మందిలో నలుగురు మృతి

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న తరువాత MS పార్క్ పోలీస్ స్టేషన్ నుండి SHO సహా బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. స్థానికుల సాయంతో చిక్కుకున్న ముగ్గురిని రక్షించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మరో ముగ్గురిని రక్షించారు. రక్షించిన వారిని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆరుగురిలో నలుగురు చనిపోయారని వైద్యులు ప్రకటించినట్లు సమాచారం అందింది. మంటలు చెలరేగిన భవనం యజమాని భరత్ సింగ్. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో యజమాని ఉంటున్నాడు. కాగా ఇతర అంతస్తులు అద్దెకు ఇవ్వబడ్డాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తోన్నారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 27 Jan 2024, 10:25 AM IST