Bilaspur Train Accident: బిలాస్‌పూర్ స్టేషన్ సమీపంలో రెండు రెళ్లు ఢీ!

ప్రమాదానికి గల కారణాలపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయిలో వివరణాత్మక విచారణ నిర్వహించబడుతుందని రైల్వే స్పష్టం చేసింది. ఈ విచారణ అనంతరం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టబడతాయని రైల్వే స్పష్టం చేసింది.

Published By: HashtagU Telugu Desk
Bilaspur Train Accident

Bilaspur Train Accident

Bilaspur Train Accident: బిలాస్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఉదయం ఒక పెద్ద రైలు ప్రమాదం (Bilaspur Train Accident) జరిగింది. ఒక గూడ్స్ రైలు, ఒక లోకల్ ట్రైన్ (MEMU) ఊహించని విధంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణీకులు గాయపడగా.. న‌లుగురు మరణించినట్లు కూడా ధృవీకరించబడింది. సహాయక, రెస్క్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులలో చేర్చారు. ఈ ప్రమాదాన్ని రైల్వే యంత్రాంగం చాలా తీవ్రంగా పరిగణించింది. తక్షణ సహాయం అలాగే విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ప్రమాదంలో ప్రభావితమైన ప్రయాణీకులకు, వారి కుటుంబ సభ్యులకు రైల్వే యంత్రాంగం ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన ప్రయాణీకులకు రూ. 5 లక్షలు ప్ర‌క‌టించారు. అలాగే సాధారణంగా గాయపడిన ప్రయాణీకులకు రూ. 1 లక్ష ప్ర‌క‌టించింది. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Also Read: Karthika Maasam : కార్తీక మాసం – పౌర్ణమి కథ వింటే ఎంత పుణ్యమో.!

రైల్వే భద్రతా కమిషనర్ (CRS) విచారణ

ప్రమాదానికి గల కారణాలపై రైల్వే భద్రతా కమిషనర్ స్థాయిలో వివరణాత్మక విచారణ నిర్వహించబడుతుందని రైల్వే స్పష్టం చేసింది. ఈ విచారణ అనంతరం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన మెరుగుదల చర్యలు చేపట్టబడతాయని రైల్వే స్పష్టం చేసింది.

ప్రయాణీకుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లు

ప్రభావిత ప్రయాణీకులు, వారి కుటుంబ సభ్యులు ఈ హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందాలని రైల్వే యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

  • బిలాస్‌పూర్- 7777857335, 7869953330
  • చంపా- 8085956528
  • రాయ్‌గఢ్- 9752485600
  • పెండు రోడ్- 8294730162
  • కోర్బా- 7869953330
  • ఉస్లాపూర్- 7777857338

 

  Last Updated: 04 Nov 2025, 07:17 PM IST