Site icon HashtagU Telugu

4 Killed : ఢిల్లీలో దారుణం.. ఒకే కుటుంబంలో న‌లుగురు దారుణ హ‌త్య‌

Son Killed Father

Crime Scene

ఢిల్లీలోని పాలం ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హ‌త్య‌కు గురైయ్యారు. మృతుల్లో ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి, అమ్మమ్మ ఉన్నారు . మృతదేహాలన్నీ ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నాయి. డ్ర‌గ్స్‌కి బానిసైన నిందితుడు తన సోదరీమణులు, తండ్రి, మనవరాలిని హత్య చేసిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళల్లో ఒకరు నెల‌పై ర‌క్త‌పు మడుగులో ఉండ‌గా.. ఇద్దరు కుటుంబ సభ్యులు బాత్‌రూమ్‌లో ప‌డి ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు స‌మాచారం.