Site icon HashtagU Telugu

4 Killed: యాదగిరిగుట్టలో విషాదం…పాత భవనం కూలి నలుగురు మృతి!!

building collapsed

building collapsed

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైనవారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

యాదగిరిగుట్లోని మెయిన్ రోడ్డులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్ ఎదురుకుండానే ఈ ఘటన సంభవించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాల్కనీ కూలిన రెండంతస్తుల భవనం దాదాపు 35ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. శిథిలాలు కిందపడుతున్న సమయలో ఈ శబ్దానికి కొందరు తప్పించుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.