వర్షాకాలంలో రక్షణ కోసం పాటించాల్సిన నియమాలు ఇవే?

  • Written By:
  • Publish Date - June 15, 2022 / 03:45 PM IST

వర్షాకాలం మొదలైంది అంటే చాలు రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సిగ్నల్ ఫ్లూలు, వైరల్ ఫీవర్ లు, ఇన్ఫెక్షన్స్, అలర్జీలు ఇలా రకరకాలుగా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. అయితే ఈ వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి పలు రకాల చర్యలు తీసుకోక తప్పదు. మరియు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి ఎటువంటి నియమాలు పాటించాలి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజువారీ వ్యాయామం: ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి చురుగ్గా పనిచేస్తుంది. అలాగే గుండె వేగంగా పనిచేయడం వల్ల శరీరం మొత్తానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా సాఫిగా జరిగేలా చేస్తుంది. సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ హార్మోన్ ను కూడా శరీరం విడుదల చేస్తుంది. ఇది ఒకవైపు సంతోషాన్నిస్తూనే మరోవైపు రోగ నిరోధక వ్యవస్థపైనా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలపై దాడికి రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.

పోషకాహారం: ఇతర కాలాలలో పోల్చుకుంటే వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు అధికంగా అవుతూ ఉంటాయి. ఈ వర్షాకాలం లోనే సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాయి. దీని కారణంగా వైరల్ ఫీవర్ లు ఇన్ఫెక్షన్లు ఇలాంటివి వస్తుంటాయి. తాజా పండ్లు, కూరగాయలు,ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకోవడం ఎంతో మంచిది. నీళ్ల విరేచనాలు అయితే ఓఆర్ఎస్ తీసుకోవాలి.

తగినంత నీరు: అదేవిధంగా తగినంత నీరు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు లోనుకాకుండా ఉండవచ్చు. దీనివల్ల చర్మంలో నూనె ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా చర్మం మృదువుగా కూడా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అధికంగా కాఫీలు టీలు లాంటివి తాగడం వల్ల డీహైడ్రేషన్ కు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.

రెండు సార్లు స్నానం: వర్షాకాలంలో కూడా ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయాలి. అది కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఎంతో మంచిది. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను నియంత్రించొచ్చు. అలాగె వాతావరణంలో అధిక తేమ కారణంగా శరీరంపై పేరుకుపోయిన చెమట, మురికిని కూడా వదిలించుకోవచ్చు.