Site icon HashtagU Telugu

4 killed : ఏలూరులో విషాదం.. పిడుగుపాటుకు నలుగురు మృతి

Lightining Imresizer

Lightining Imresizer

ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలులో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పిడుగుపాటుకు నలుగురు కూలీలు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్లను తొలగిస్తుండగా పిడుగుపాటు కూలీలపై పడినట్లు తెలిసింది. మృతులు కొండబాబు (35), ధర్మరాజు (20), రాజు (25), వేణు (18). నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కూలీలు తోట పనులకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన గుడారాల కింద నివసిస్తున్నారు.