Delhi Assembly: మణిపూర్ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ అధికార పార్టీ సిద్దమవ్వగా, బీజేపీ ఎమ్మెల్యేలు చర్చను నిరాకరించారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ మేరకు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ కు గురయ్యారు.
ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ మణిపూర్లో జరిగిన హింసాకాండ అంశాన్ని లేవనెత్తారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు మణిపూర్ చర్చను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఢిల్లీ సమస్యలపై చర్చించాలని, అంతేకానీ మణిపూర్ అంశం ఎందుకు అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ నిరసనపై డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసహనం వ్యక్తం చేశారు. యూపీ అసెంబ్లీ కూడా మణిపూర్ అంశంపై చర్చించిందని బీజేపీపై మండిపడ్డారు. అయినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు చర్చను పదేపదే అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు అభయ్ వర్మ, జితేందర్ మహాజన్, అజయ్ మహావార్ మరియు ఓపి శర్మలను సభ నుండి సస్పెండ్ చేశారు. అదే సమయంలో ఆప్ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Also Read: Tirumala Forest : జగన్ మెడకు స్మగ్లింగ్ `చిరుత`లు