ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల్లో వలసలు మొదలయ్యాయి. పలువురు నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీలో ఉంటుందో దానిని బట్టి అడుగులేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ వైసీపీ ని వదిలి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా గన్నవరం వైసీపీ కీలక నేత యార్లగడ్డ వెంకట్ రావు (Yarlagadda Venkat Rao)..ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ (TDP) లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)తో భేటీ అయ్యారు.
టీడీపీలో చేరడానికి తాను ఇష్టంగానే ఉన్నానని, త్వరలోనే చేరతానని చంద్రబాబుకు చెప్పినట్లుగా యార్లగడ్డ మీడియాతో తెలిపారు. చంద్రబాబు కూడా కలిసి పని చేద్దామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారని. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే ప్రజా ప్రతినిధిగా ఉండాలని భావించి గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయానని గుర్తు చేశారు. తన ప్రత్యర్థి అయిన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కి మద్దతు పలికారని, దాంతో వైసీపీ అధిష్టానం తనను పూర్తిగా పక్కకు పెట్టేసిందని , గత మూడున్నర ఏళ్ల నుంచి అధిష్ఠానం తనను, తన అనుచరులను పట్టించుకోవడం మానేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమే అని అన్నారు. గన్నవరం, విజయవాడ లేదా గుడివాడ నుంచి కూడా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
Read Also : RTC Bus Fell : పాడేరు ఘాట్ రోడ్డు వద్ద లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి