Site icon HashtagU Telugu

IPL Sachin Tendulkar: సచిన్ కాళ్లమీదపడ్డ జాంటీ రోడ్స్…వైరల్ వీడియో..!!

sachin jhonty

sachin jhonty

IPL2022లో బుధవారం ముంబై ఇండియన్స్ VS పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత. ఆసక్తికరమైన సీన్ కనిపించింది ముంబై వరసగా ఐదోసారి ఓటమిపాలైంది. మ్యాచ్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఇంతలో పంజాబ్ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ స్టేడియంలో చేసిన ఓ పనికి ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులందరూ నవ్వుకున్నారు.

సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత పంజాబ్ జట్టు సభ్యలందరితో ఒక్కోక్కరుగా కరచాలనం చేస్తున్నారు. పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే సచిన్ టెండూల్కర్ తో కొద్దిసేపు మాట్లాడాడు. తర్వాత జాంటీ రోడ్స్ వంతు వచ్చింది. జాంటీ రోడ్స్ సచిన్ తో కరచాలనం చేయకుండా…సచిన్ పాదాలను తాకి సెల్యూట్ చేసేందుక ప్రయత్నించాడు. దీంతో సచిన్ వెంటనే ఆయన్ను అడ్డుకున్నాడు. ఇద్దరూ కూడా ఒకరికొకరు కరచాలనం చేసుకుని ఓ హగ్ తీసుకుని ముందుకు కదిలారు. దీంతో అక్కడే ఉన్న ఆటగాళ్లంతా నవ్వుకున్నారు.