Site icon HashtagU Telugu

Punjab: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

Punjab

New Web Story Copy (53)

Punjab: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ (95) అంత్యక్రియలు పూర్తయ్యాయి. తన స్వగృహం బాదల్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ తన తండ్రికి అంత్యక్రియలను పూర్తి చేశారు.

ప్రకాష్ సింగ్ అంతిమ యాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్, జే&కే మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, హర్యానా INLD నాయకుడు అభయ్ చౌతాలా, కేంద్ర మంత్రి సోమనాథ్, మాజీ ఆరోగ్య మంత్రి సూర్జిత్ జ్యానీ, కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ డిప్యూటీ సీఎం ఓం ప్రకాష్ సోనీ, శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్ జాతేదార్ జియానీ హర్‌ప్రీత్ సింగ్, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ హెడ్ అడ్వకేట్ హర్జిందర్ సింగ్ ధామి, బిజెపి నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. రాజకీయాల బాబా బోహద్ గా పిలుచుకునే ప్రకాష్ సింగ్ బాదల్ చివరి చూపు నోచుకునేందుకు పంజాబ్ నుంచి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. .

భాదల్ సాహెబ్ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకునేలా ఉండేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొనియాడారు.ఆయన జీవితం సమాజంలోని అన్ని వర్గాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదలు, రైతుల గురించి ఆందోళన చెందడం ఆయన స్వభావం. అతనితో నాకు వ్యక్తిగత సంబంధం ఉంది. అందరినీ ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన మరణం తీరనిలోటు అంటూ కన్నీరుపెట్టుకున్నారు. బాదల్ రాజకీయాల యూనివర్సిటీ అని శరద్ పవార్ అన్నారు. ఆయన మృతితో రాజకీయాల్లో తీరని లోటు అని అన్నారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ మంగళవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మంగళవారం తుది శ్వాస విడిచారు. సుమారు 70 ఏళ్లపాటు ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పంజాబ్ రాజకీయాల్లో, సిక్కు మతంలో గాడ్‭ఫాదర్ లా కొనసాగారు.

Read More: Ram Charan: ఆసక్తి రేపుతున్న RC16, బాడీ బిల్డర్‌ పాత్రలో రామ్ చరణ్?

Exit mobile version