Site icon HashtagU Telugu

Uttar Pradesh: బీజేపీకి బిగ్ షాక్

Template (82) Copy

Template (82) Copy

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత‌, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరారు. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ వ్యవ‌స్థాప‌క దినోత్సవం సంద‌ర్భంగా ప్రియాంక గాంధీ సమక్షంలో సునీల్ శాస్త్రి పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శాస్త్రికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సునీల్ శాస్త్రి కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ప్రియాంక గాంధీ ట్వీట్టర్ వేదికగా “కాంగ్రెస్ సైనికుడు, భారత మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు శ్రీ సునీల్ శాస్త్రి గారిని ప్రేమతో కలవడానికి కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం కంటే మంచి సందర్భం ఏముంటుంది.” అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సునీల్ శాస్త్రి మాట్లాడుతూ.. ప్రస్తుత యూపీ రాజకీయాలపై అన్నీ విషయాలు చర్చించామని, కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Exit mobile version