బ్యాంకు రుణాలు ఎగేసిన కేసులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బెయిల్ మంజూరు అయింది. రూ. 25వేల పూచికత్తుతో గీత ఆమె భర్త రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానాను విధించిన విషయం విదితమే. ఆమెతో పాటు ఆమె భర్త రామకోటేశ్వరరావుకు కూడా ఇదే శిక్షను విధిస్తూ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు రెండు రోజుల క్రితం సంచలన తీర్పు ఇచ్చింది. రుణ మోసాలకు పాల్పడిన బ్యాంకు అధికారులు అరవిందాక్షన్, జయప్రకాశ్ లకు కూడా ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ శిక్షను వేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జి షీట్ 2015లోనే సీబీఐ దాఖలు చేసింది. వాదప్రతివాదనలను తరువాత జైలు శిక్ష వేయడంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయగా విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Kothapalli Geetha : మాజీ ఎంపీ `కొత్తపల్లి గీత`కు బెయిల్

Kothapalli Geetha Imresizer