Site icon HashtagU Telugu

Konda Vishweshwar Reddy: కొండంత “నీడ”

Konda

Konda

భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఎండలతో పడరాని పాట్లు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో చిరు వ్యాపారులు, కార్మికులు, రైతులు ఎండలను సైతం లెక్కచేయకుండా తమ తమ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ఎండలకు భయపడి పనికెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి వాళ్లది. అలాంటివాళ్ల జీవితాలకు గొడుగు పట్టే ప్రయత్నం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

ఎండలకు చెక్ పెట్టేలా “నీడ” పేరుతో గొడుగులను ఆవిష్కరించారాయన. దీన్ని తలకు తొడుక్కొని హాయిగా పనిచేసుకోవచ్చు. రోడ్లు ఊడ్చే మున్సిపల్ మహిళా కార్మికులకు, ట్రాక్టర్ డ్రైవర్ లకు, ఎడ్ల బండి నడిపే రైతులకు, గోర్ల కాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండ నుంచి కాదు.. వర్షం చినుకుల నుంచి జనాలను రక్షణ కవచంగా ఉంటుంది. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందించిన గొడుగులు చేవేళ్లలోని పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మండుటెండల్లోనూ తమ తమ పనులు చేసుకుంటున్నారు.