Site icon HashtagU Telugu

Vijayashanti: అద్వానీ వదిలిన బాణం

Vijayashanti

Vijayashanti

బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ రాజకీయాల్లో తనకు గాడ్ ఫాదర్ అని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. 1997లో వచ్చిన ఒసేయ్ రాములమ్మ సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత 1998లో రాజకీయాల్లోకి వచ్చాను’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. నటిగా మారిన రాజకీయ నాయకురాలు అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. బీజేపీ అగ్రనాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె కారణంగా తాను బీజేపీలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.

అద్వానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే బీజేపీలో చేరినట్లు ఆమె వెల్లడించారు. వాజ్‌పేయి , అద్వానీలకు క్రెడిట్ ఇస్తూ, వాళ్ల మాటలకు, రాజకీయ చతురతకు ముగ్గులైనట్టు బీజేపీలో చేరినట్టు స్పష్టం చేశారు. సినిమాల్లో విజయశాంతి తన కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు హీరోల కంటే టాలీవుడ్‌లో ఎక్కువ పారితోషికం పొందినట్లు చెప్పారు. రెన్యూమరేషన్ మొత్తాన్ని వెల్లడించమని అడిగినప్పుడు నిర్మాతలు ఆ సమయంలో ప్రతి చిత్రానికి రూ. 1 కోటి చెల్లించారు” అని విజయశాంతి చెప్పింది.