Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ ‌రెడ్డి కన్నుమూత

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ ‌రెడ్డి (Kothakota Dayakar Reddy) కన్నుమూశారు.

Published By: HashtagU Telugu Desk
Kothakota Dayakar Reddy

Resizeimagesize (1280 X 720) 11zon

Kothakota Dayakar Reddy: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ ‌రెడ్డి (Kothakota Dayakar Reddy) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన టీడీపీ తరుఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. రెండుసార్లు అమర చింత, ఒకసారి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దింతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుప్రతిలో జాయిన్ చేశారు.

Also Read: BVSN Prasad : జనసేనలోకి సినీ నిర్మాత BVSN ప్రసాద్.. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చేరిక..

దయాకర్ రెడ్డి 1994,1999లో టీడీపీ తరపున అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009లో మక్తల్ నుంచి టీడీపీ తరపున విజయం సాధించారు. మొత్తం మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీతమ్మ కూడా ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచారు. 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికవ్వగా.. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు.

  Last Updated: 13 Jun 2023, 07:08 AM IST