Site icon HashtagU Telugu

Vatti Vasantha Kumar: మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత

Vatti Vasantha Kumar

Resizeimagesize (1280 X 720) 11zon

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (Vatti Vasantha Kumar) కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు వసంత కుమార్. ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Also Read: Earthquake: ఇరాన్‌లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి.. 440 మందికి గాయాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. వసంతకుమార్ పశ్చిమ గోదావరి జిల్లా పూండ్ల స్వస్థలం. 1955లో ఆయన జన్మించారు. 2004లో ఉంగుటూరు ఎమ్మెల్యేగా వసంత కుమార్ పనిచేశారు. తిరిగి 2009లోనూ ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తీరుపై కలత చెందిన ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన ఎంఎంపురం గ్రామానికి తీసుకురానున్నారు.