ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి (Former Minister), మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ (Kuthuhalamma) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె చికిత్స పొందుతూ తిరుపతిలోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో కుతూహలమ్మ మంత్రిగా పని చేశారు. వైఎస్ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2021లో టీడీపీకి రాజీనామా చేశారు.
Also Read: Road Accidents: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.