మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డి.డి. లాపాంగ్( DD Lapang )(91) మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.
Sushila Karki: నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి నియామకం
లాపాంగ్ 1992 నుంచి 2010 మధ్య నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1972లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన లాపాంగ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన మృతి మేఘాలయ రాజకీయాలకు ఒక తీరని లోటు అని పలువురు అభిప్రాయపడ్డారు. లాపాంగ్ భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన లాపంగ్-ప్యారాకు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.