Women Cops Harassed: కేరళ ఖాకీలు.. ‘కాస్టింగ్ కౌచ్’

శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ డిపార్ట్ మెంట్ లో మేల్ డామినేషన్ పెరిగిపోతుందా..? డిపార్ట్ మెంట్ లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారా..?

  • Written By:
  • Updated On - February 22, 2022 / 05:39 PM IST

శాంతిభద్రతలను పరిరక్షించే పోలీస్ డిపార్ట్ మెంట్ లో మేల్ డామినేషన్ పెరిగిపోతుందా..? మహిళా పోలీస్ ఉద్యోగిణులు లైంగిక వేధింపులు ఫేస్ చేస్తున్నారా..? డీఐజీ పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా.. ? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేరళ పోలీస్ డిపార్ట్ మెంట్లో కాస్టింగ్ కౌచ్ జరిగినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 2020లో సర్వీస్ నుంచి పదవీ విరమణ చేసిన కేరళలో మొదటి మహిళా IPS అధికారి R శ్రీలేఖ పోలీసు శాఖలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఆమెను సంప్రదించినప్పుడు.. కొన్ని విషయాలు వెలుగుచూశాయి. తనను వేధింపులకు గురిచేస్తున్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి) నుంచి రక్షించమని కోరినట్టు శ్రీలేఖ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.

“నేను డిపార్ట్ మెంట్ లో చేరబోతున్నప్పుడు ఓ డీజీపీ ‘మా డిపార్ట్ మెంట్’ని కలుషితం చేయడానికి ఒక మహిళ వస్తోందని ఆరోపించినట్టు నాకు తెలిసింది. మగ సహోద్యోగుల నుంచి దూషణలు ఎదుర్కొన్నా”అని శ్రీలేఖ చెప్పారు. శ్రీలేఖ చేసిన ఆరోపణలపై కేరళ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సీఆర్ బిజు స్పందిస్తూ.. “మహిళా ఎస్‌ఐ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినప్పుడు, అలాంటి సమయంలో వ్యక్తి వివరాలను  శ్రేలేఖ లాంటివాళ్లు ఎందుకు గోప్యంగా ఉంచినట్టు ” అని రియాక్ట్ అయ్యాడు. పోలీసు శాఖలో లైంగిక వేధింపుల ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని పేర్కొన్నారు.

అయితే, మహిళా పోలీసుల పట్ల లైంగిక వేధింపులు వాస్తవమని త్రిసూర్ రూరల్ మహిళా సెల్ ఎస్‌ఐ వినయ NA అన్నారు. శారీరక వేధింపులే కాకుండా మాటల దాడికి ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా ఇష్టానుసారంగా నోరే పారేసుకుంటారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి తనను అనుచితంగా తాకడంపై సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశానని, కానీ ఓ ఉన్నతాధికారికి కంప్లైంట్ చేస్తే.. అతను ఇచ్చిన సమాధానం చాలా భాద కలిగించింది.  ఓ సారి ఉన్నతాధికారి నన్ను ఒంటరిగా తన క్వార్టర్స్ కు రమ్మని అడిగాడు. అతన్ని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఇక డివైఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) నేను డ్యూటీలో ఉన్నప్పుడు, ఎవరినైనా అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు, దారి మధ్యలో తాకే ప్రయత్నం చేసేవాడు. లైంగిక వేధింపులు ఉన్నాయని శ్రీలేఖ మేడం చెప్పినప్పుడు, నేను వంద శాతం నమ్ముతాను. డిపార్ట్ మెంట్లో చాలా మంది బాధితులు ఉన్నారు. కానీ ఎవరూ మాట్లాడరు’’ అని వినయ అన్నారు. ఫిబ్రవరి 21న కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో జరుగుతున్న తప్పుడు పద్ధతుల గురించి ఆమె నాతో ఎప్పుడూ చెప్పలేదు. ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. కానీ రుజువు చేయలేకపోయింది. ఏం జరిగిందో స్పష్టంగా చెబితే చర్యలు తీసుకుంటామని అన్నారు.