Site icon HashtagU Telugu

Karnataka : రోడ్డు ప్రమాదంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి మృతి.. హ‌త్యగా అనుమానిస్తున్న పోలీసులు

Ib Officer Imresizer

Ib Officer Imresizer

క‌ర్ణాట‌క‌లో ఓ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు.అయితే తొలుత రోడ్డు ప్ర‌మాదంగా పోలీసులు భావించారు. కానీ సీసీటీవీ పుటేజీలో ఓయ కారు అధికారిని గుద్దించిన‌ట్లు క‌నిపిస్తుండ‌టంతో కేసు మ‌రో మ‌లుపు తిరిగింది.రిటైర్డ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఆర్‌ఎస్ కులకర్ణిగా గుర్తించారు.శుక్రవారం సాయంత్రం గంగోత్రి (మైసూరు యూనివర్సిటీ) క్యాంపస్‌లోని కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ పక్కన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు.