Site icon HashtagU Telugu

Skill Development Case : మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ చెప్పిన కీలక విషయాలు

Skill Development Case - Former IAS PV Ramesh

Skill Development Case - Former IAS PV Ramesh

చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ (Former IAS PV Ramesh) స్కిల్ డెవలప్‍మెంట్ కేసు (Skill Development Case)పై కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో తన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసు పెట్టారనడం దిగ్భ్రాంతికరమన్నారు. నా వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ (Chandrababu Arrest) చేశారనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను అప్రూవర్‍ గా మారాననే ప్రచారం అవాస్తవం అని కొట్టిపారేశారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‍మెంట్ లో ఆర్థికశాఖ ఏ తప్పు చేయలేదన్నారు. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందన్నారు. తాను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

Read Also : AP : జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటున్న వైసీపీ ఎంపీ

విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్‌ ఏమయ్యాయి..?..స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫైల్స్‌ స్పష్టంగా చూడాలి..!! తప్పు చేసిన అధికారులను వదిలి మాజీ సీఎంను ఎలా అరెస్ట్‌ చేస్తారు..? ఎండీ, కార్యదర్శిల పాత్రే ప్రధానం, వారి పేర్లు ఏవి..? అని మాజీ ఐఏఎస్ పీవి రమేశ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో వుండేవారు నిత్యం కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారని.. ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాలని పీవీ రమేశ్ తెలిపారు. ప్రతి బ్యాంక్ ఖాతాలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. సీఎం.. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించడం జరగని పని అని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ఈ కేసు విచారణలో సీఐబీకి పీవీ రమేష్‌ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారనని గుర్తు చేశారు. దానిని ఇప్పుడు సీఐడీ అధికారులు ఈ స్టేట్‌మెంట్‌కు అనుకూలంగా మార్చుకుందని పీవీ రమేష్‌ తాజాగా ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫైల్స్‌ చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నారు.