Site icon HashtagU Telugu

Convicted: మ‌రో కేసులో హ‌ర్యానా మాజీ సీఎం చౌతాలా దోషి

Chautala

Chautala

హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలా మ‌రో కేసులో దోషిగా తేలారు. ఇప్ప‌టికే టీచ‌ర్ల కుంభ‌కోణంలో దోషిగా నిర్థారింప‌బ‌డి ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపిన సంగ‌తి తెలిసిందే. ఆ శిక్ష పూర్తి చేసుకుని గ‌తేడాది జులైలో ఆయ‌న విడుద‌ల‌య్యారు. ప‌దేళ్ల జైలు శిక్ష అనుభ‌వించి వ‌చ్చిన ఆయ‌న మ‌రో కేసులో దోషిగా నిలిచారు. ఈ సారి ఏ త‌ర‌హా శిక్ష ప‌డుతుంద‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగిన ఆరోప‌ణ‌ల‌పై చౌతాలాపై గ‌తంలోనే కేసు న‌మోదు అయ్యింది. ఆ కేసు విచార‌ణ‌ను చేప‌ట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శ‌నివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ఏ త‌ర‌హా శిక్ష విధించాల‌న్న విష‌యంపై కోర్టు ఈ నెల 26న చేప‌ట్ట‌నున్న విచార‌ణ‌లో నిర్ణ‌యం తీసుకోనుంది.