Lalu Prasad : ఆసుప‌త్రిలో చేరిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్‌

  • Written By:
  • Publish Date - July 4, 2022 / 11:18 AM IST

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సోమవారం ఉదయం మెట్లపై నుంచి పడిపోయారు. ఆయ‌న పరిస్థితి విషమించడంతో పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో కుటుంబ‌స‌భ్యులు చేర్చారు. ఆయన ఐసీయూలో ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం లాలూ ప్రసాద్ తన ఇంటి వద్ద మెట్లపై నుండి పడిపోవడంతో కుడి భుజం ఫ్రాక్చర్ అయింది. తెల్లవారుజామున 4 గంటలకు శ్వాసకోశ సమస్యల గురించి చెప్ప‌డంతో లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వెంటనే అతన్ని సమీపంలోని పరాస్ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చారు.

దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ దోషిగా తేలి ప్రస్తుతం సగానికిపైగా జైలు శిక్ష పూర్తి చేసుకుని బెయిల్‌పై ఉన్నారు.లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు కిడ్నీ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులలో నీరు చేరడం, రక్తపోటుతో సహా అనేక ఆరోగ్య వ్యాధులతో బాధపడుతున్నారు. 75 ఏళ్ల వ‌య‌సున్న లాలూ ప్ర‌సాద్ తన కిడ్నీ మార్పిడి కోసం వైద్యులను సంప్రదించడానికి సింగపూర్ వెళ్లాలనుకుంటున్నారు. తాజాగా ఆయ‌న పాస్‌పోర్టును కూడా కోర్టు విడుదల చేసింది.