విద్యా రంగం (Education ) బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా కమిషన్ (telangana education commission) న ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ పని చేయనుంది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు కానుంది. విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. చైర్మన్, సభ్యులు రెండేండ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు పలు మార్పులు చేసేందుకు కొత్త కమిషన్ ఏర్పరచినట్లు ప్రిన్సిపల్ సెక్రెటరి బుర్ర వేంకటేశం తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణలో కొన్ని తీవ్రమైన సమస్యలున్నట్లు మా దృష్టికి వచ్చింది. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాల మెరుగుపరిచి.. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS)-2021 ప్రకారం విద్యార్థుల అభ్యాస ఫలితాలపై దృష్టి కేంద్రీకరిస్తాం. పరిశోధనా నైపుణ్యాల లేమి కారణంగా విశ్వవిద్యాలయ స్థాయి తగ్గిపోతుంది. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య నాణ్యతను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని సంస్కరించాల్సి ఉందన్నారు.
Read Also : Roja : ఇది ముమ్మాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే: రోజా
