Rhino Video Viral: గ్రామంలో ఖడ్గమృగం హల్ చల్.. చక్కర్లు కొడుతున్న వీడియో!

ఖడ్గమృగం ఓ గ్రామంలో చక్కర్లు కొడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Viral

Viral

ఖడ్గమృగం ఓ గ్రామంలో చక్కర్లు కొడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇండియా ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ఆ వీడియోను షేర్ చేశారు. ఖడ్గమృగం ఒక గ్రామంలోకి ప్రవేశించి వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. అయితే అదృష్టవశాత్తూ జంతువు ఊళ్లోకి ప్రవేశించిన సమయంలో వీధుల్లో ఎవరూ లేరట. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. “మానవ ఆవాసాల్లోకి ఖడ్గమృగాలు వెళ్లినప్పుడు.. జనాలు గందరగోళం చెందాల్సిన అవసరం లేదు” అని సుశాంత నంద ట్వీట్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాచ్ చేయండి మరి.

  Last Updated: 09 Aug 2022, 03:07 PM IST