Gangraped: విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం.. ఎక్క‌డంటే..?

జార్ఖండ్ ఉప రాజధాని దుమ్కా నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. భర్తతో కలిసి వేర్వేరు బైక్‌లపై టూర్‌కు వెళ్లిన స్పెయిన్‌ మహిళపై శుక్రవారం అర్థరాత్రి సామూహిక అత్యాచారం (Gangraped) జరిగింది.

  • Written By:
  • Updated On - March 2, 2024 / 12:05 PM IST

Gangraped: జార్ఖండ్ ఉప రాజధాని దుమ్కా నుంచి పెద్ద వార్త బయటకు వస్తోంది. భర్తతో కలిసి వేర్వేరు బైక్‌లపై టూర్‌కు వెళ్లిన స్పెయిన్‌ మహిళపై శుక్రవారం అర్థరాత్రి సామూహిక అత్యాచారం (Gangraped) జరిగింది. ఈ సంఘటన తర్వాత ఈ 28 ఏళ్ల స్పానిష్ మహిళ సరైయాహత్ సిహెచ్‌సిలో చేరింది.

హన్స్‌దిహాలోని కుర్‌మహత్ సమీపంలో ఈ ఘటన

హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్‌మహత్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తీవ్రతను గమనించిన ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అర్థరాత్రి ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మహిళపై సామూహిత అత్యాచారం జ‌రిగిన‌ట్లు పోలీసులు కూడా పేర్కొన్నారు. సారయ్యహత్ సిహెచ్‌సిలో ప్రథమ చికిత్స అనంతరం ఆమెను దుమ్కాకు తీసుకువచ్చారు. ఆ మహిళ పోలీసుల రక్షణలో బైక్‌పై సరైయాహట్ నుంచి దుమ్కాకు చేరుకుంది.

ఆ మహిళ తన భర్తతో కలిసి బైక్‌ టూర్‌కు వెళ్లింది

సమాచారం ప్రకారం.. ఈ స్పానిష్ మహిళ తన భర్తతో కలిసి బైక్ టూర్‌కు వెళ్లింది. ఆమె దుమ్కా మీదుగా భాగల్పూర్ వైపు వెళ్తున్నారు. అయితే ఆల‌స్యం కావ‌టంతో రాత్రి 12:00 గంటల సమయంలో విదేశీ జంట హన్స్దిహా మార్కెట్ ముందు ఒక నిర్జన ప్రదేశంలో ఒక టెంట్ వేసుకుని పడుకున్నారు. అదే సమయంలో సమీప ప్రాంతానికి చెందిన కొందరు యువకులు అక్కడికి చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భ‌ర్త‌ను కొట్టారు.

Also Read: Central Election Commission: లోక్​సభ ఎన్నికలు..రాజకీయ పార్టీలకు ఈసీ సూచనలు, హెచ్చరికలు

బాధితురాలిపై అత్యాచారం చేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు జరిగిన ఘటనపై మహిళ పోలీసులకు సమాచారం అందించింది. దీని తర్వాత ఆమెను సారయ్యహత్ సిహెచ్‌సిలో చేర్చారు. దుమ్కా ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ ఘటన జరిగినట్లు మాత్రమే చెప్పారు. ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని బాధితురాలు చెప్పినట్లు ఆయన తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందిన సమాచారం ప్రకారం బాధిత స్పానిష్ మహిళను ప్రథమ చికిత్స అనంతరం దుమ్కాకు తీసుకువస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసు బృందంతో పాటు ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నిపుణుల బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరోవైపు బాధిత విదేశీ మహిళ స్వయంగా పరీక్ష కోసం బైక్‌పై దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకుంది. పోలీసు బృందం ఆమెకు తోడుగా నిలిచింది.