Hyderabad Metro Extends Timings: ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల‌ సమయం పొడిగింపు..!

కిక్రెట్ అభిమానుల కోసం మెట్రో (Hyderabad Metro Extends Timings) సంస్థ తన సమయాల్లో మార్పులు చేపట్టింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ మార్గంలో మెట్రోరైలు సమయం పొడిగించబడ్డాయి.

  • Written By:
  • Updated On - March 27, 2024 / 05:30 PM IST

Hyderabad Metro Extends Timings: కిక్రెట్ అభిమానుల కోసం మెట్రో (Hyderabad Metro Extends Timings) సంస్థ తన సమయాల్లో మార్పులు చేపట్టింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల‌ సమయం పొడిగించబడ్డాయి. ఇవాళ మెట్రో రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని ఎండీ NVS రెడ్డి అన్నారు. చివరి రైళ్లు 12.15 గంటలకు బయలుదేరి 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం నిర్ణీత సమయానికి మించి మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ప్రకటించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. క్రికెట్ అభిమానుల సౌక్యారార్థం చివరి రైళ్లు 12.15 గంటలకు బయలుదేరి 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటుందని వెల్లడించారు.

Also Read: Babar Azam: మ‌రోసారి పాకిస్థాన్ జ‌ట్టు కెప్టెన్‌గా బాబ‌ర్ ఆజ‌మ్‌..?

ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంకు, తిరిగి వచ్చేందుకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు TSRTC ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. TSRTC మార్చి 27, ఏప్రిల్ 5 తేదీలలో సాయంత్రం 6 నుండి 11:30 గంటల వరకు 24 రూట్లలో 60 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ఈ బస్సులు కోటి, చార్మినార్, చాంద్రాయణగుట్ట నుండి ఆర్‌జిఐసి స్టేడియం వరకు 24 వివిధ మార్గాల్లో తిరుగుతాయి. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లేందుకు TSRTC బస్సులు అందుబాటులో ఉంటాయి. హైద‌రాబాద్‌లో తొలి మ్యాచ్ మార్చి 27న, సన్‌రైజర్స్ హైదరాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ వ‌ర్సెస్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ మధ్య ఏప్రిల్ 5న మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి.

We’re now on WhatsApp : Click to Join