AP CM: 33వేల ఉద్యోగాలు రెడీ – జ‌గ‌న్‌

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 33వేల మందికి ఉద్యోగాల‌ను ఇస్తాయ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంచ‌నా వేశారు. స్థానిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు త‌మ వంతు సాయం అందిస్తామన్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటీసీ గ్లోబల్ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 05:37 PM IST

రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు 33వేల మందికి ఉద్యోగాల‌ను ఇస్తాయ‌ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంచ‌నా వేశారు. స్థానిక రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు త‌మ వంతు సాయం అందిస్తామన్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఐటీసీ గ్లోబల్ చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

త్వరలో 10 యూనిట్లకు రూ. కోటి వ్యయంతో శంకుస్థాపన చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. మొత్తం 1250 కోట్లతో ఈ యూనిట్లను 26 జిల్లాల్లో ఏర్పాటు చేస్తే దాదాపు 33,000 ఉద్యోగాలు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (EoDB) లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు. కంపెనీ కష్టాలను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని, కేవలం ఫోన్ కాల్ చేస్తే చాలంటూ బిజినెస్ చైర్మన్ సంజీవ్ పూరీకి హామీ ఇచ్చారు.