Food Poisoning: నిజామాబాద్ లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థినులకు అస్వస్థత!

  • Written By:
  • Updated On - September 13, 2023 / 11:33 AM IST

నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చదువుతున్న 100 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో చోటుచేసుకుంది. విద్యార్థినులు నిన్న రాత్రి భోజనం చేశారని, మంగళవారం ఉదయం అల్పాహారం చేశారని అధికారులు తెలిపారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు బాధపడటంతో సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నా.. హాస్టల్ సిబ్బంది విద్యార్థినులకు అపరిశుభ్రమైన భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు.

జిల్లా కలెక్టర్ రాజీవ్ హనుమంతు ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థినులకు పరిశుభ్రమైన ఆహారం అందించే అంశాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఫుడ్‌పాయిజన్‌తో బాధపడుతున్న విద్యార్థినులకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేపీ నేత తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. ఫామ్‌హౌస్‌ ముఖ్యమంత్రి నిద్రలేచి సమస్యలు పరిష్కరించాలని, సీఎం నిర్లక్ష్యం కారణంగా ఇంకెంత మంది విద్యార్థులు బలి కావాలో’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read: iPhone 15 Launched : అదిరిపోయే ఫీచర్స్ తో ‘ఐఫోన్ 15’ ఫోన్లు వచ్చేశాయ్