Site icon HashtagU Telugu

Food Apps: ఫుడ్ సర్వీస్ సేవల్లో స్వల్ప అంతరాయం

Food

Food

ఫుడ్ డెలివరీ యాప్‌లు Zomato, Swiggy సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయాయి. అమెజాన్ సర్వీసెస్ క్రాష్ కారణంగా స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో కస్టమర్లు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్లు ఇవ్వడం, బుక్ చేయడం లాంటి సమస్యలు తలెత్తడంతో మండిపడుతున్నారు. ఈ విషయమై సంబంధిత నిర్వాహకులు రియాక్ట్ అవుతూ.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే లంచ్ సమయం కావడంతో దేశవ్యాప్తంగా టెక్నికల్ ఇష్యూ రావడంతో ఫుడ్ సర్వీస్ సేవలపై పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.