Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్.. రైల్వే శాఖ సరికొత్త సదుపాయం!

1343776 Irctc Whatsapp Number

1343776 Irctc Whatsapp Number

WhatsApp: దేశం డిజిటలైజ్ అవుతోంది. అందులో భాగంగా చాలా సర్వీసులు ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా కొత్త పుంతలు తొక్కుతుండగా.. తాజాగా ఈకోవలోకి రైల్వే శాఖ చేరింది. రైల్వే శాఖ ఇప్పటికే ఎన్నో సదుపాయాలను డిజటలైజేషన్ లో భాగంగా తీసుకురాగా.. తాజాగా మరో సేవను రైల్వే శాఖ తీసుకువచ్చింది. ఇక మీదట రైల్వే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే సదుపాయం రానుంది.

ఈ-కేటరింగ్ సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా రైల్వే శాఖ కొత్తగా ఈ సేవలను అందుబాటులోకి తేబోతోంది. ఐఆర్సీటీసీ ప్రస్తుతం www.ecatering.irctc.co.in, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పిస్తుండగా.. 8750001323 వాట్సాప్ నెంబర్ ద్వారా ఫుడ్ ఆర్డర్ సేవలను అందుబాటులోకి రానున్నాయి.

ఇక మీదట రైల్వే టికెట్ బుక్ చేసుకోగానే వాట్సాప్ నెంబర్ నుండి ఈ-కేటరింగ్ సర్వీస్ సేవలకు సంబంధించిన www.ecatering.irctc.co.in వెబ్ లింక్ వస్తుంది. అక్కడ కస్టమర్లు అందుబాటులో ఉన్న స్టేషన్లలో తమకు నచ్చిన రెస్టారెంట్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయం కలుగుతుంది. ఆ తర్వాత నుంచి ఏఐ ఆధారిత చాట్ బోట్ ఈ కేటరింగ్ కు సంబంధించిన సేవలను నేరుగా అందిస్తుంది.

రైల్వే శాఖ ఈ కొత్త సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తుండగా.. త్వరలోనే ఈ సదుపాయాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే, వినియోగదారుల నుండి వచ్చిన స్పందన ఆధారంగా మిగిలిన రైళ్లకు విస్తరిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. మరి రైల్వే ప్రయాణికులు కొత్త సేవలను ఎలా వినియోగించుకుంటారనేది చూడాలి.