Credit Card Upgrade: క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేస్తున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. కొద్ది రోజులు వాడిన తర్వాత వాటిని

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 03:58 PM IST

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. కొద్ది రోజులు వాడిన తర్వాత వాటిని అప్ గ్రేడ్ చేసుకోవాలని సంబంధిత బ్యాంక్ నుంచి కాల్స్ వస్తుంటాయి. ఇందులో మంచి ఆఫర్లను వారు అందిస్తుంటారు. అలాంటి అప్ గ్రేడ్ సమయంలో కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. మరి క్రెడిట్ కార్డు ని అప్డేట్ చేసుకుంటున్న వారు ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మనం క్రెడిట్ కార్డు ని ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటాం.

అంటే ప్రయాణాలు, నిత్యవసరకులు, షాపింగ్, ఇంధనం ఇలా రకరకాల కేటగిరిలో ఉపయోగిస్తుంటాం.. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు ఏదో కేటగిరీలో ప్రత్యేక ప్రయోజనాల్ని కల్పించేలా ఆఫర్లను అందిస్తుంటాయి. మీ ఖర్చులు ఏ కేటగిరీలో అధికంగా ఉంటాయో గమనించి దానికి తగ్గట్టుగా కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. ఇకపోతే మీకు ఏ రకమైన కార్డు కావాలో తెలుసుకున్న తర్వాత వివిధ సంస్థలు ఇచ్చే ఆఫర్లను అర్థం చేసుకోవాలి. వాటి నుంచి అందే ప్రయోజనాలను పోల్చి చూడాలి. ఒకవేళ మీరు షాపింగ్‌ కార్డుని ఎంచుకుంటే రివార్డు పాయింట్లు, క్యాష్‌ బ్యాక్‌, రాయితీ ఇలా ఏ రూపంలో ఎంతమేర ప్రయోజనం లభిస్తుందో చూసుకోంవాలి.

కొన్ని కార్డులు ప్రత్యేకమైన బ్రాండ్ల పై మాత్రమే ఆఫర్లను అందిస్తుంటాయి. అలాగే మంచి ప్రయోజనాలు ఉన్నాయంటే వార్షిక రుసుము కూడా అధికంగానే ఉంటుంది. అందుకే మీరు చెల్లించే రుసుముకి వచ్చే ప్రయోజనాలకి పొంతన ఉందో లేదో చూసుకోవాలి. మరికొన్ని సంస్థలు నిర్దిష్ట వ్యయ పరిమితిని నిర్దేశిస్తాయి. అది దాటితే వార్షిక రుసుముని రద్దు చేస్తాయి. కాబట్టి మీ ఖర్చు ఆ స్థాయిలో ఉందో లేదో తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే రుసుము ఉండాలి. వ్యయ పరిమితి చేరుకోలేని స్థాయిలో ఉంటే అధిక రుసుము చెల్లించి కూడా ప్రయోజనం ఉండదు. కాగా క్రెడిట్ కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకున్నప్పుడు సహజంగానే క్రెడిట్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. అంటే క్రెడిట్‌ కార్డు పై మీకు లభించే మొత్తాన్ని జారీ సంస్థలు పెంచుతాయి. అత్యవసర సమయాల్లో క్రెడిట్‌ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో ఫలితంగా క్రెడిట్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. అలాగే కొత్త కార్డు వల్ల అధిక ప్రయోజనాలు ఉంటేనే దానికి వెళ్లాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న కార్డు వల్ల మీరు అత్యధికంగా పొందుతున్న లబ్ధిని కొత్త కార్డు ద్వారా కోల్పోకుండా చూసుకోవాలి. అలాగే ఈ కార్డులో ఉన్న రివార్డు పాయింట్లు కొత్త కార్డుకి బదిలీ అయ్యేలా చూసుకోవాలి.