నెలనెలా గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులు గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేయాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితిలో నెలకొంటున్నాయి. అయితే తొందరగా గ్యాస్ అయిపోయింది అనే బాధపడేవారు కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించడం వల్ల గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు. మరి ఎటువంటి చిట్కాలను పాటించి గ్యాస్ ను ఆదా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆహార పదార్థాలను వేడి చేయడం కోసం గ్యాస్ సిలిండర్ కు బదులుగా మైక్రోవేవ్ ను ఉపయోగించడం మేలు. అలాగే మీ ఆహార పదార్థాలలో భోజనం సలాడ్లు పండ్లను జోడించడం వల్ల గ్యాస్ ఆదా చేయవచ్చు.
ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.. అదేవిధంగా వంట చేసేటప్పుడు పాత్రలు తడిగా ఉంటే అలాగే నేరుగా స్టవ్ మీద పెట్టడం వల్ల అవి వేడి కావడానికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి వంట చేయడానికి ముందు ఆ పాతలను శుభ్రంగా తుడిచి ఉపయోగించాలి. మరి ముఖ్యంగా ఎప్పటికప్పుడు గ్యాస్ బర్నర్ ను శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే గ్యాస్ పైప్ ద్వారా నిరోధించబడి గ్యాస్ వృథా అవుతుంది. అలాగే ఫ్రిజ్లో ఆహార పదార్థాలను ఎప్పుడుగా నేరుగా గ్యాస్ పై ఉంచకూడదు. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత గది ఉష్ణోగ్రతలో ఉంచి ఆ తర్వాత వాటిని గ్యాస్ మీద పెట్టి ఉపయోగించుకోవచ్చు.
అలాగే వంట చేసేటప్పుడు ప్రెజర్ కుక్కర్ ని ఉపయోగించడం వల్ల గ్యాస్ ఆధార్ చేసుకోవచ్చు. అలాగే వంట చేసేటప్పుడు ముఖ్యంగా ఉంచుకోవాల్సిన ప్రధాన విషయం ఎప్పుడూ వంటలను సిమ్ లో పెట్టి చేసుకోవడం వల్ల గ్యాస్ ఆధా అవుతుంది. ఈ రకమైన చిట్కాలను పాటించడం ద్వారా గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు.