Lalu Prasad: మాజీ సీఎం లాలూకు బెయిల్

దాణా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కు బెయిల్ మంజూరు అయింది.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 04:35 PM IST

దాణా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కు బెయిల్ మంజూరు అయింది. జార్ఖండ్‌లోని డోరాండా ట్రెజరీ నుండి డబ్బును మోసపూరితంగా డ్రా చేసుకున్న కేసులో జైలు జీవితం గ‌డుపుతోన్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు శుక్రవారం జార్ఖండ్ హైకోర్టు నుండి బెయిల్ ఇచ్చింది. అంతకుముందు, కోట్లాది రూపాయల దాణా కుంభకోణంపై సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రసాద్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 1990వ ఏడాది ఆఖ‌రిలో బీహార్‌లోని డోరండా ట్రెజరీ నుండి ₹139.5 కోట్ల ను డ్రా చేసుకున్నారు. అందుకు సంబంధించి సీబీఐ కోర్టు లాలూకు శిక్ష విధించబడింది.

ఈ “కేసులో శిక్షను సస్పెండ్ చేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. ఐదేళ్ల శిక్షలో సగానికిపైగా ఇప్పటికే అనుభవించినందున బెయిల్ మంజూరు చేసింది. అతను ఇంకా సగం శిక్షను అనుభవించలేదని సిబిఐ బెయిల్‌ను వ్యతిరేకించింది. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 42 నెలలుగా జైలులో ఉన్న బీహార్ మాజీ ముఖ్యమంత్రిపై ₹950 కోట్ల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన ఐదవ కేసు డోరాండా ట్రెజరీ కేసు. ప్రస్తుతం పలు అనారోగ్యాల కారణంగా ఢిల్లీలోని AIIMSలో చేరారు. మిగిలిన నాలుగు కేసుల్లో ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. “డోరాండా ట్రెజరీ కేసులో బెయిల్ పొందిన తర్వాత అతను ఇప్పుడు జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది” అని ఆర్జేడీ నాయకుడు ఒకరు చెప్పారు.

లాలూ భార్య రబ్రీ దేవి అధికారిక నివాసమైన 10 సర్క్యులర్ రోడ్‌లో చిన్న కుమారుడు మరియు వారసుడు తేజస్వి యాదవ్ శుక్రవారం ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. పశుగ్రాసం కుంభకోణం కేసుగా ప్రసిద్ధి చెందిన కోట్లాది రూపాయల పశుసంవర్థక శాఖ కు చెందిన కేసు. జంతువులకు మేతను త‌ర‌లిస్తూ ట్రక్కులు, లారీలలో స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల రిజిస్ట్రేషన్ నంబర్‌లను కలిగి ఉన్నారని చెప్పబడింది. సుదీర్ఘ విచార‌ణ త‌రువాత ప‌లు కీల‌క మ‌ల‌పులు తిరుగుతూ వ‌స్తోన్న ఈ కేసులు ఎట్ట‌కేల‌కు లాలూ బెయిల్ పొందారు.