Floating Restaurant : నీటిపై తేలియాడే రెస్టారెంట్ స్టార్ట్ అయింది.
ఇప్పటివరకు ముంబై , గోవాలలోనే అందుబాటులో ఉన్న తేలియాడే రెస్టారెంట్ ఇప్పుడు గుజరాత్ లోని సబర్మతి నదిపై కూడా ప్రారంభమైంది.
దీనిలో ఉన్న వసతులు ఏమిటి ? టూరిస్టు ప్యాకేజీల వివరాలు ఏమిటి ?
సబర్మతి నదిపై తేలియాడే రెస్టారెంట్ ను అహ్మదాబాద్‌లోని అక్షర్ ట్రావెల్స్, అమ్దావద్ మున్సిపల్ కార్పొరేషన్, సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అహ్మదాబాద్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో 162 సీట్లు ఉన్నాయి. ఇందులో కూర్చుంటే.. భోజనం చేస్తూ గంటన్నర పాటు(90 నిమిషాలు) జల విహారం చేయొచ్చు. సిటీలోని సర్దార్ బ్రిడ్జి నుంచి గాంధీ వంతెన వరకు ఈ రెస్టారెంట్ ట్రావెల్ చేస్తుంది. ఈ ప్రయాణంలో టూరిస్టుల కోసం లైవ్ మ్యూజిక్ కన్సెర్ట్ ను నిర్వహిస్తారు. ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను నిర్మించడానికి రూ.10 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై కప్పు ఉంటుంది. కాబట్టి పర్యాటకులు వర్షాకాలంలో కూడా ప్రశాంతంగా జర్నీ చేస్తూ ఫుడ్ తినొచ్చు.
Also read : Diet for Jaundice: కామెర్లు ఉన్నవారు ఇలాంటి ఫుడ్ తినకూడదు?.. ఈ అలవాట్లను ఫాలో అయితే సమస్య చెక్ పెట్టొచ్చు..!
ఈ తేలియాడే రెస్టారెంట్ లో(Floating Restaurant) మధ్యాహ్న భోజన సమయ స్లాట్‌లు 12, 1:20, 1:45, 3:15 మధ్య ఉంటాయి. డిన్నర్ టైం స్లాట్‌లు 7:15, 8:45, 9:15, 10:30 మధ్య ఉంటాయి. ఇందులో మంటలను ఆర్పేందుకు స్ప్రింక్లర్ సౌకర్యం, లైఫ్ బోట్, లైఫ్ జాకెట్లు, ఇతర భద్రతా సౌకర్యాలు ఉన్నాయి. ఈ క్రూయిజ్ సైజు 30 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు. దీని వెనుక భాగంలో వంటగది ఉంటుంది. అయితే రెస్టారెంట్‌కు ఆహారం బయట తయారు చేసి తీసుకొస్తారు. కొన్ని రకాల ఆహారాలు మాత్రమే క్రూయిజ్ లో వండుతారు. ఒక వ్యక్తి క్రూయిజ్ టూర్ ఖర్చు రూ. 2,000. జూలై 10 నుంచి ఈ యాత్రకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయి. టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో, వ్యక్తిగతంగా లేదా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కొనొచ్చు.